సౌత్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తూ యమా బిజీగా ఉన్న రష్మిక మందన్నా. గతేడాది యానిమల్ మూవీతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఆమె మరో మూవీలో నటిస్తోంది. ఈ మూవీలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నారు. స్త్రీ, బేడియా, ముంజ్యు క్రియేటర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీలు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి ‘థమా’ అనే టైటిల్‌ను ఖారారు చేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఈ యూనివర్స్ ఓ ప్రేమ కథను కోరుకుంటోంది. దురదృష్టవశాత్తూ అది చాలా ఉద్వేగంతో కూడుకున్నదని టీమ్ తెలిపింది. ఈ సినిమా వచ్చే ఏడాది (2025) దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హర్రర్, కామెడీ నేపథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది.

- October 30, 2024
0
24
Less than a minute
Tags:
You can share this post!
administrator