కన్నడ సూపర్ స్టార్ యశ్ వివాదంలో చిక్కుకున్నారు. తన కొత్త సినిమా ‘టాక్సిక్’ షూటింగ్ కోసం ఇష్టానుసారంగా చెట్లను నరికివేశారంటూ ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే, తాజాగా ఆ ప్రాంతంలో చెట్ల నరికివేతపై ప్రభుత్వం విడుదల చేసిన శాటిలైట్ చిత్రాలతో పంచాయితీ మొదలైంది. యశ్ నటిస్తున్న టాక్సిక్ సినిమా చిత్రీకరణ షూటింగ్ బెంగళూరు సమీపంలోని పీణ్య – జలహళ్లి అటవీ ప్రాంతంలో జరుగుతోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ కోసం వందలాది చెట్లను హిందుస్థాన్ మెషీన్ టూల్స్ (హెచ్ఎంటీ) అక్రమంగా నరికివేసిందంటూ కర్ణాటక పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే తెలిపారు.

- October 30, 2024
0
43
Less than a minute
Tags:
You can share this post!
administrator