బాలీవుడ్‌ యాక్టర్‌పై అత్యాచారం కేసు

బాలీవుడ్‌ యాక్టర్‌పై అత్యాచారం కేసు

బాలీవుడ్‌ నటుడు అజాజ్‌ ఖాన్‌పై రేప్‌ కేసు నమోదైంది. సినీ పరిశ్రమలోకి వచ్చేందుకు సాయం చేస్తానని నమ్మించి తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నటుడు అజాజ్‌పై 30 ఏళ్ల వయసున్న మహిళ ఫిర్యాదు చేసింది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేందుకు సాయం చేస్తానని నమ్మించి అనేక ప్రాంతాల్లో తిప్పుతూ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు సదరు మహిళ ఫిర్యాదులో ఆరోపించింది. మహిళ ఫిర్యాదు మేరకు అత్యాచారానికి సంబంధించి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద నటుడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.

editor

Related Articles