టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా లీడర్ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వగా, బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా మంచిపేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ప్రధాన పాత్రలో సినిమాలు చేస్తూనే సపోర్టింగ్ రోల్స్‌లో కూడా నటించి మంచిపేరు తెచ్చుకున్నాడు. ఓవైపు నిర్మాతగా చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తూనే తను కూడా పలు సినిమాలలో ప్రధాన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. రానా ఈ మధ్య సినిమాలలో కనిపించింది చాలాతక్కువ. షోలు కూడా చేసింది లేదు. సోషల్ మీడియాలో పలకరించింది కూడా చాలా తక్కువ. చాలా రోజుల తర్వాత రానా తన భార్య మిహికాతో కలిసి కనిపించడంతో పిక్స్ వైరల్ అవుతున్నాయి. రానా, మిహికాలు 2020 ఆగస్టు 8న పెళ్లి చేసుకున్నారు. కరోనా సమయంలో వీరి పెళ్లి జరగడంతో పెద్దగా ప్రముఖులు ఎవరు హాజరు కాలేదు. వివాహం జరిగినప్పటి నుండి ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ వస్తూ ఉన్నారు. ఆ మధ్య మిహికా ప్రెగ్నెంట్ అని ప్రచారం జరిగింది. కాని దానిపై క్లారిటీ లేదు. అమెరికా వెకేషన్లో భాగంగా న్యూయార్క్ టైమ్స్ వద్ద స్టైలిష్ లుక్స్‌లో దిగిన పిక్స్ మిహిక షేర్ చేసింది. ఇందులో ఇద్దరూ చాలా క్యూట్‌గా కనిపించారు.

