రాంచరణ్‌ ఆర్‌సీ 16 షూట్‌ టైం.. షురూ.. డైరెక్టర్-బుచ్చి బాబు సాన

రాంచరణ్‌ ఆర్‌సీ 16 షూట్‌ టైం.. షురూ.. డైరెక్టర్-బుచ్చి బాబు సాన

హీరో రాంచరణ్  త్వరలోనే గేమ్‌ ఛేంజర్‌తో ఫ్యాన్స్, మూవీ లవర్స్‌కు వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకముందే ఆర్‌సీ 16కు సంబంధించిన వార్తలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌లో జోష్‌ నింపుతోంది రాంచరణ్‌ టీం. తాజాగా ఆర్‌సీ 16 షూటింగ్‌ అప్‌డేట్‌ను షేర్ చేశాడు డైరెక్టర్ బుచ్చిబాబు సాన. మైసూరులోని ఛాముండేశ్వరి మాత ఆశీస్సులతో మొదలు.. మీ దీవెనలు కావాలి.. అంటూ చేతిలో స్క్రిప్ట్‌ పట్టుకుని గుడి ముందు దిగిన ఫొటోను ఎక్స్‌ ద్వారా షేర్ చేశాడు బుచ్చిబాబు. ఇప్పుడీ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా కోసం కొన్నిరోజుల క్రితం రాంచరణ్‌ బ్లాక్ టీ షర్ట్‌ అండ్ షార్ట్‌లో యెల్లో గ్రీన్ షూ వేసుకుని.. ఫిట్‌నెస్‌ కోచ్‌ శివోహంతో ఉన్న స్టిల్‌ను షేర్ చేస్తూ బీస్ట్‌ మోడ్‌ ఆన్‌.. అంటూ షేర్ చేసిన స్టిల్‌ నెట్టింట చక్కర్లు కొడుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ సినిమాకి తంగలాన్‌ కాస్ట్యూమ్ డిజైనర్‌ ఏగన్‌ ఏకాంబరం పనిచేయబోతున్నాడు. ఆర్‌సీ 16లో కథానుగుణంగా రాంచరణ్‌ ఉత్తరాంధ్ర మాండలికంలో మాట్లాడనున్నాడట. బాలీవుడ్‌ భామ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

editor

Related Articles