రాంచరణ్‌ – ఆర్‌సీ 16లోకి జగపతిబాబు

రాంచరణ్‌ – ఆర్‌సీ 16లోకి జగపతిబాబు

బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రాంచరణ్‌ నటిస్తున్న ఆర్‌సీ 16 (RC16) సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ జగ్గూభాయ్ ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ప్రాజెక్టులో బాలీవుడ్‌ భామ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది చాలా ముఖ్యమైన రోజు. ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న క్షణం. మైసూరులోని ఛాముండేశ్వరి మాత ఆశీస్సులతో మొదలు.. మీ దీవెనలు కావాలి.. అంటూ బుచ్చి బాబు షేర్ చేసిన ఆర్‌సీ 16 షూటింగ్ అప్‌డేట్‌ స్టిల్  నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాకి తంగలాన్‌ కాస్ట్యూమ్ డిజైనర్‌ ఏగన్‌ ఏకాంబరం పనిచేస్తుండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాని సుకుమార్ రైటింగ్స్‌‌-మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆర్‌సీ 16 సినిమాకి ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నాడు.

editor

Related Articles