హీరో అక్కినేని నాగచైతన్య త్వరలో రెండో వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ వేడుక గురించి నాగార్జున ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. పెళ్లి చాలా సింపుల్‌గా చేస్తున్నట్లు వెల్లడించారు. సమంతతో విడాకుల అయిన తర్వాత నటి శోభితా ధూళిపాళ్లతో ఏడడుగులు వేయబోతున్నాడు. డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇప్పటికే పెళ్లిపనులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇక ఈ వేడుక గురించి నాగార్జున ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. పెళ్లి చాలా సింపుల్‌గా చేస్తున్నట్లు వెల్లడించారు. నాగచైతన్య – శోభిత పెళ్లికి అన్నపూర్ణ స్టూడియోస్ వేదిక కావడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. పెళ్లిని చాలా సింపుల్‌గా చేయాలని చైతూ కోరినట్లు నాగార్జున పేర్కొన్నారు. చై కోరిక మేరకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ ప్రముఖులు మొత్తం 300 మందిని ఈ వివాహ వేడుకకు ఆహ్వానించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. స్టూడియోలో ఏర్పాటు చేసిన అందమైన సెట్‌లో చై-శోభిత ఒక్కటి కాబోతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. పెళ్లి పనులు కూడా వారిద్దరే దగ్గరుండి చూసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. సంప్రదాయ తెలుగు పద్ధతిలో పెళ్లిచేస్తున్నట్లు వివరించారు.

- November 22, 2024
0
27
Less than a minute
Tags:
You can share this post!
editor