నడిమింటి బంగారు నాయుడు నిర్మాతగా నిర్మాణం పూర్తి చేసుకున్న రాజుగారి దొంగలు సినిమా త్వరలో విడుదల కానుంది. ఇందులో తారాగణం లోహిత్ కళ్యాణ్, రాజేష్ కుంచాడా, జోషిత్ రాజ్‌కుమార్, కైలాష్ వేలాయుధన్, పూజా విశ్వేశ్వర్, టీవీ రామన్, ఆర్కే నాయుడు ప్రధాన పాత్రధారులుగా రూపొందిన సినిమా ‘రాజుగారి దొంగలు’. లోకేష్ రనల్ హిటాసో డైరెక్టర్.
ఆదివారం హైదరాబాద్‌లో ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. నిర్మాతలు వి.దామోదర ప్రసాద్, బెక్కెం వేణుగోపాల్, నటుడు జెమినీ సురేష్ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు దర్శక, నిర్మాతలకు ప్రధాన పాత్రధారులంతా కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాత అద్భుతంగా సహకరించారని, అందరికీ నచ్చేలా సినిమా తీశామని డైరెక్టర్ తెలిపారు. ఈ సినిమాకి సంగీతం: నాఫల్ రాజా ఏఐఎస్.