మహేష్‌బాబు పాత్రకు రాజమౌళి రుద్ర అనే పేరు ఫిక్స్?

మహేష్‌బాబు పాత్రకు రాజమౌళి రుద్ర అనే పేరు ఫిక్స్?

ప్రస్తుతం మహేష్‌బాబు ఒడిశా షూటింగ్‌లో ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ నెలాఖరు వరకు అక్కడి పర్వత ప్రాంతాల్లోని పలు లొకేషన్లలో ప్రధాన ఘట్టాలను తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది. ఈ సినిమా కోసం మహేష్‌బాబు సరికొత్త మేకోవర్‌తో సిద్ధమయ్యారు. తాజాగా ఈ సినిమాలో మహేష్‌బాబు పాత్ర గురించి ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది. ఇందులో ఆయన రుద్ర అనే పాత్రలో కనిపిస్తారని తెలిసింది. మహేష్‌బాబు సినిమాల్లో ఆయన పాత్రల పేర్ల విషయంలో కూడా ప్రత్యేకతలు కనిపిస్తాయి. రాజమౌళి సినిమాలోని ‘రుద్ర’ అనే పేరు కూడా పాన్‌ ఇండియాకు రీచ్‌ అయ్యేలా బాగుందని అభిమానులు సోషల్‌ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమాకు ‘గరుడ’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. అయితే టైటిల్‌ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

editor

Related Articles