బందూక్‌ చేతబూనిన భద్రకాళిలా హీరోయిన్ అనుష్క

బందూక్‌ చేతబూనిన భద్రకాళిలా హీరోయిన్ అనుష్క

క్రిష్‌ జాగర్లమూడి డైరెక్షన్‌లో అనుష్క మెయిన్ రోల్‌గా రూపొందుతోన్న సినిమా ‘ఘాటి’. రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. ప్రమోషన్‌లో భాగంగా ఇటీవలే గ్లింప్స్‌ని విడుదల చేశారు. తాజాగా ఆదివారం ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్‌ ప్రకటించారు. ఏప్రిల్‌ 18న ప్రపంచవ్యాప్తంగా పాన్‌ ఇండియా రేంజ్‌లో సినిమా విడుదల కానున్నదని మేకర్స్‌ తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్‌ డేట్‌ పోస్టర్లో చీరకట్టుకొని, చేతిలో తుపాకీతో కొండపై నిలబడి టెర్రిఫిక్‌ లుక్‌లో కనిపిస్తోంది అనుష్క. ఆమె శరీరమంతటా చెల్లాచెదురుగా ఉన్న రక్తపు మరకలు పాత్రలోని ఉద్వేగాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి కథ: చింతకింది శ్రీనివాసరావు, సంగీతం: నాగవెల్లి విద్యాసాగర్‌.

editor

Related Articles