BFI లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గర్భంతోనే స్టేజ్ షోలో పాల్గొన్న రాధికా ఆప్టే

BFI లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గర్భంతోనే స్టేజ్ షోలో పాల్గొన్న రాధికా ఆప్టే

నటి రాధికా ఆప్టే గర్భవతి, BFI లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కడుపుతోనే స్టేజీపైన ప్రదర్శన ఇచ్చారు. ఇటీవల BFI లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024కి హాజరయ్యారు. ఆమె తన రాబోయే సినిమా సిస్టర్ మిడ్‌నైట్  UK ప్రీమియర్‌లో ఫస్ట్‌టైమ్ తన బేబీ బంప్‌ను ప్రదర్శించింది. ఆమె UKలో తన సినిమా సిస్టర్ మిడ్‌నైట్ ప్రీమియర్‌కి హాజరయ్యారు.

ప్రస్తుతం జరుగుతున్న BFI లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో తొలిసారిగా తన బేబీ బంప్‌ను ప్రదర్శించిన నటి రాధికా ఆప్టే. నటి తన తాజా బహిరంగ ప్రదర్శనతో మౌనంగా తాను గర్భవతినని తెలియజేసింది. అక్టోబర్ 17న, నటి తన రాబోయే చిత్రం సిస్టర్ మిడ్‌నైట్ UK ప్రీమియర్ నుండి ఫొటోలను షేర్ చేశారు. ఈవెంట్ కోసం నటి ఆఫ్ షోల్డర్ బ్లాక్ బాడీకాన్ డ్రెస్ ధరించారు. ఆమె ఫొటోలు పోస్ట్ చేసిన వెంటనే, ఆమె గర్భవతి అని తెలిసి అభిమానులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు.

administrator

Related Articles