‘పుష్ప 2’ సినిమా ఏప్రిల్ 13న టీవీలోకి..

‘పుష్ప 2’ సినిమా ఏప్రిల్ 13న టీవీలోకి..

హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమాకి సీక్వెల్‌గా పుష్ప‌2 సినిమా చేసి పెద్ద హీరోగా మారాడు. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన సినిమా ‘పుష్ప 2’. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్‌గా నటించాడు. అలాగే సునీల్, అనసూయ, రావు రమేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా థియేట‌ర్‌లోనే కాక ఓటీటీలోనూ విడుదలై అక్కడ కూడా రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ‘పుష్ప 2’ సినిమా టీవీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ‘పుష్ప 2’ ఏప్రిల్ 13న సినిమా మాటీవీలో సా.5.30 గంటలకు టెలికాస్ట్ అయ్యేందుకు సిద్ధ‌మైంది. టీవీలో టెలికాస్ట్ కావడం ఇదే తొలిసారి కాబట్టి పుష్ప 2 సినిమా రికార్డు టీఆర్పీలను సాధిస్తుందని అంటున్నారు. ఇప్పుడు టీవీలో కూడా ఒకే రోజున వివిధ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఏప్రిల్ 13న, ‘పుష్ప 2’ సినిమా తెలుగుతో పాటు కన్నడ, తమిళం తదితర భాషల్లో వివిధ ఛానెళ్లలో ప్రసారం కానుండ‌గా, దీనికి సంబంధించి విప‌రీత‌మైన ప్ర‌మోష‌న్స్ జ‌రుగుతున్నాయి.

editor

Related Articles