హీరో బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఐతే, ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాలోని ఫ్లాష్ బ్యాక్‌పై ఓ అప్‌డేట్ వినిపిస్తోంది. ఈ ఫ్లాష్ బ్యాక్‌లో బాలయ్య రెగ్యులర్ పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంటుందని, ముఖ్యంగా సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా వెరీ ఎమోషనల్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాను రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్‌లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి. అన్నట్టు నిర్మాతలు ఈ ఏడాది సెప్టెంబర్ 28న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్‌కి సిద్ధం చేస్తున్నారు.

- April 7, 2025
0
10
Less than a minute
Tags:
You can share this post!
editor