సుధీర్ బర్త్ డేకు పవర్‌ఫుల్ పోస్టర్ రిలీజ్..!

సుధీర్ బర్త్ డేకు పవర్‌ఫుల్ పోస్టర్ రిలీజ్..!

సుడిగాలి సుధీర్‌గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ ఆనంద్ కొత్త చిత్రం ‘హై లెస్సో’తో మరోసారి ఆకట్టుకోబోతున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రసన్న కుమార్ కోట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వజ్ర వారాహి సినిమాస్ బ్యానర్‌పై శివ చెర్రీ, రవికిరణ్ నిర్మిస్తున్నారు. పోస్టర్‌లో సుధీర్ ఆనంద్ రఫ్, ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై అంచనాలు పెంచేశారు. చేతిలో ఖడ్గం, రక్తపు మరకలు, ఆలయ వాతావరణం పోస్టర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాలో ప్రముఖ నటుడు శివాజీ విలన్‌గా నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో డివోషన్, యాక్షన్, ఎమోషన్ కలగలిసిన కథతో ఈ మూవీ రూపొందుతోంది. హైదరాబాద్‌లో ఇప్పటికే కీలక షెడ్యూల్ పూర్తవగా, త్వరలో ఏలూరులో భారీ షెడ్యూల్ జరగనుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Related Articles