ప్రియాంక చోప్రాకు పారితోషికం రూ.30 కోట్లట..?

ప్రియాంక చోప్రాకు పారితోషికం రూ.30 కోట్లట..?

మహేష్‌బాబు హీరోగా రాజమౌళి డైరెక్షన్‌లో రూపొందుతున్న సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌ పాత్రకు దాదాపుగా ఖరారైట్లు తెలిసింది. ఈ విషయంలో చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌ చేరుకున్న ప్రియాంకచోప్రా ఈ సినిమా సన్నాహాల్లో బిజీగా ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ప్రియాంకచోప్రాకు 30 కోట్ల భారీ పారితోషికం అందించనున్నారని తెలిసింది. ఒకవేళ ఈ వార్తే నిజమైతే.. భారతీయ సినిమాలో ఓ కథానాయిక స్వీకరించే అత్యధిక పారితోషికం ఇదే అవుతుంది. ఏది ఏమైనా ఈ సినిమా ద్వారా భారతీయ సినిమాలో అత్యధిక రెమ్యూనరేషన్‌ అందుకోబోతున్న హీరోయిన్‌గా ప్రియాంకచోప్రా సరికొత్త ఘనతను సాధించబోతోందని ట్రేడ్‌వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

editor

Related Articles