హోళి పండుగని దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా అయితే ఏకంగా మహేష్-రాజమౌళి సినిమా సెట్‌లో హోళి సెలబ్రేషన్స్ జరుపుకోవడం విశేషం. ఎస్ఎస్ఎమ్‌బీ 29లో ప్రియాంక చోప్రా కథనాయిక కాగా, రీసెంట్‌గానే ఈ సినిమా కోసం ఇండియాకు వచ్చింది. ఒడిశాలో జరుగుతున్న కొత్త షెడ్యూల్‌కు వెళ్లింది. ఇక హోళీ అని, రాజమౌళి టీంతో కలిసి హోళి సెలబ్రేషన్స్ జరుపుకుంది. అందుకు సంబంధించి ప్రియాంక చోప్రా ఓ పోస్ట్ పెట్టింది. హోళీ రోజు కూడా మాకు వర్కింగ్ డే అని తన టీంతో హోళీని సెలెబ్రేట్ చేసుకున్న ఫోటోలను ప్రియాంక చోప్రా పంచుకుంది. హోళీ సందర్భంగా ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో తన సెలబ్రేషన్ ఫోటోలతో పాటు రంగులను సైతం ఫోటో తీసి షేర్ చేశారు. ఇవి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రియాంక చోప్రా పెట్టిన పోస్ట్‌కు నమ్రత స్పందించడంతో అది మహేష్-రాజమౌళి సినిమా సెట్ అని అందరు ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఒరిస్సా రాష్ట్రంలోని కోరట్ పూర్‌లో జరుగుతోంది. లేటెస్ట్ షెడ్యూల్‌లో ప్రియాంక సైతం పాల్గొంటున్నారు.

- March 15, 2025
0
17
Less than a minute
Tags:
You can share this post!
editor