హిట్టు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు నటుడు నితిన్. సినిమాలోని వార్నర్ ఫస్ట్‌లుక్‌ను నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇవాళ విడుదల చేసింది. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ‘రాబిన్‌హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాబిన్‌హుడ్ సినిమాలోని వార్నర్ ఫస్ట్‌లుక్‌ను నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇవాళ విడుదల చేసింది. ‘బౌండరీ నుండి బాక్సాఫీస్‌కు వస్తున్న వార్నర్‌కు స్వాగతం’ అంటూ పోస్టర్‌ను పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. భీష్మ సినిమా తర్వాత నితిన్ – వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీలీల కథానాయిక. ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- March 15, 2025
0
18
Less than a minute
Tags:
You can share this post!
editor