కోలీవుడ్‌లో భారీ స్టార్‌డం ఉన్న హీరోస్‌లో థలా అజిత్ కుమార్ కూడా ఒకరు. మరి అజిత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమానే “గుడ్ బ్యాడ్ అగ్లీ”. తన ఫ్యాన్ దర్శకుడు అధిక్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమాపై అజిత్ కెరీర్‌లోనే భారీ హైప్‌ని సెట్ చేసుకుంది. మెయిన్‌గా అజిత్ నుండి మిస్ అవుతున్న డార్క్ స్వాగ్‌ని అభిమానులకి ఓ రేంజ్‌లో తాను ప్రెజెంట్ చేస్తుండగా టీజర్ తోనే సాలిడ్ బజ్ ఈ సినిమాకి వచ్చేసింది. ఇక ఈ సినిమా నుండి అవైటెడ్‌గా ఫస్ట్ సింగిల్‌ని ఊరిస్తుండగా ఈ మాస్ ట్రీట్‌కి ఇప్పుడు డేట్ వచ్చేసింది. దీంతో ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌గా ఓజి సంభవం అంటూ మార్చ్ 18న రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. ఇక ఈ సినిమాకి జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా తనకు ఈ సాంగ్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ సినిమా తెలుగు సహా తమిళ్‌లో ఈ ఏప్రిల్ 10న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.

- March 15, 2025
0
17
Less than a minute
Tags:
You can share this post!
editor