తమిళ హీరో రజనీకాంత్‌ని మలయాళ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కలుసుకున్నాడు. తన అభిమాన హీరోని కలుసుకున్న సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు పృథ్వీరాజ్. మలయాళీ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఎల్2 ఎంపురాన్. బ్లాక్ బస్టర్ సినిమా లుసిఫర్ సినిమాకి ఈ సినిమా సీక్వెల్‌గా వస్తుంది. నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మంజు వారియర్, టోవినో థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు పృథ్వీరాజ్. అయితే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైకి వెళ్లిన పృథ్వీరాజ్ తాజాగా రజనీకాంత్‌ను కలిశారు. చెన్నై పోయెస్ గార్డెన్‌లోని రజనీకాంత్ నివాసంకు వెళ్లిన పృథ్వీరాజ్ రజనీకాంత్‌ని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు.

- March 18, 2025
0
16
Less than a minute
Tags:
You can share this post!
editor