నటి హేమ మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో తన నటనతో ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ఒకప్పుడు హేమ అంటే ఆమె నటించిన క్యారెక్టర్స్ గుర్తుకు వస్తాయి. హేమ ‘అతడు’ సినిమాలో బ్రహ్మానందంతో కలిసి చేసిన కొన్ని సీన్స్‌కి జనాలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. నటి హేమ ఎన్ని సినిమాలు చేసినా కూడా.. అతడు సినిమా గురించే అడుగుతుంటారు. అయితే అలాంటి పాత్రలు ఎప్పుడు చేస్తారు హేమ గారూ అని అడగగా, అలాంటి పాత్రలు కాదు.. అసలు ఇకపై ఎలాంటి పాత్రలు చేయనంటూ పెద్ద షాక్ ఇచ్చింది నటి హేమ. నేను 14 ఏళ్ళ వయసు నుండి కష్టపడుతున్నా. ఇకపై విశ్రాంతి తీసుకుంటూ ఎంజాయ్ చేయాలనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది . జీవితాంతం కష్టపడుతూనే ఉండాలా, కొంచెం చిల్ అవ్వాలి కదా అందుకే చిల్ అవుతున్నా. సినిమాలకు, నటనకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాను. నటి హేమ.. ఇప్పటివరకూ తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో కలిపి దాదాపు 500 పైగా సినిమాల్లో నటించింది. హేమ అసలు పేరు కృష్ణవేణి కాగా, ఈమెది అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు. సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చిన హేమ.. సీరియల్స్‌లో కూడా నటించింది. 1989లో ‘చిన్నారి స్నేహం’ సినిమాలో చిన్న పాత్రలో నటించిన ఆమె చివరిగా 2023లో వచ్చిన ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ సినిమాలో కనిపించింది. అతడు, దేశముదురు, పెళ్లైన కొత్తలో, శ్రీరామదాసు, భగీరథ, మల్లీశ్వరి లాంటి చిత్రాలు హేమకి మంచి పేరు తీసుకురావడమే కాక జనాలకి దగ్గర చేశాయి.

- March 19, 2025
0
14
Less than a minute
Tags:
You can share this post!
editor