తాజాగా మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్‌కి ఓ నెటిజన్ వెరైటీ ప్రశ్న వేశాడు. దానికి ఈ తమిళ బ్యూటీ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. మాళవిక మోహనన్ ప్రస్తుతం తెలుగు, తమిళ్ భాషల్లో క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. తంగలాన్ సినిమాతో ఈ హీరోయిన్ క్రేజ్ అమాంతం పెంచుకోగా, ఆ మధ్యన ఓ హిందీ సినిమాలోనూ కనిపించి మెప్పించింది. ఇక ఇప్పుడు ప్రభాస్ -మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న రాజాసాబ్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ హీరోయిన్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అందాలతో అదరగొడుతోంది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు చాలా ఓపికగా కూడా సమాధానాలు ఇస్తూ ఉంటుంది. అయితే రీసెంట్‌గా ఓ నెటిజన్ మాళవికను డైరెక్ట్‌గా మీరు వర్జినా అని అడిగారు. దానికి చాలా కోపం తెచ్చుకున్న మాళవిక.. ఈ రకమైన చెత్త ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు. ఇలాంటివి అడగడం మానేయండి అంటూ వార్నింగ్ ఇచ్చింది.

- March 15, 2025
0
60
Less than a minute
Tags:
You can share this post!
editor