తెలుగు రాష్ట్రాలు పవర్ స్టార్ అలాగే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా అయినటువంటి పవన్ కళ్యాణ్ నేడు తన పొలిటికల్ పార్టీ జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా తన నియోజకవర్గ పరిధిలో జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సభలో పవన్ కళ్యాణ్ స్పీచ్ కోసం అంతా ఓ రేంజ్‌లో ఎదురు చూడగా ఈ స్పీచ్‌పై ఓ సర్‌ప్రైజింగ్ వ్యక్తి రెస్పాన్స్ అందించడం మెగా అభిమానులకి మరింత ఆనందం కలిగించింది. అయితే అది మరెవరో కాదు హీరో చిరంజీవినే.. పవన్ స్పీచ్ ఇలా అయ్యిందో లేదో చిరు తన ఎక్స్ ఖాతా నుండి వదిలిన పోస్ట్ వైరల్‌గా మారింది. “మై డియర్ బ్రదర్ పవన్ కళ్యాణ్ జనసేన జయకేతన సభలో నీ స్పీచ్‌కి మంత్రముగ్ధుడినయ్యాను. సభ కొచ్చిన అశేష జన సంద్రం లానే నా మనసు ఉప్పొంగింది. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తితో నీ జైత్రయాత్ర నిర్విఘంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను. జన సైనికులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు” అంటూ పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు అభిమానుల్లో పట్టరాని ఆనందాన్ని నింపింది.

- March 15, 2025
0
16
Less than a minute
Tags:
You can share this post!
editor