సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ షూటింగ్‌లో జాయిన్ కాబోతున్న ప్రభాస్. ఈ సినిమా ఫిబ్రవరిలోనే షూటింగ్ మొదలవుతుందని వార్తలొచ్చాయి. ప్రస్తుతం ‘ది రాజాసాబ్’ ‘ఫౌజీ’ సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్న ప్రభాస్. తాజా సమాచారం ప్రకారం మేలో సెట్స్‌మీదకు వెళ్లనుందని తెలిసింది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా బిజీగా ఉన్నారని చెబుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. పోలీస్ యాక్షన్ సినిమాల్లో ఇప్పటివరకు రాని వినూత్నమైన కాన్సెప్ట్‌తో దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా స్క్రిప్ట్‌ను తయారు చేశారు. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫిజికల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారట. పోలీస్ కథలకు సరికొత్త నిర్వచనంలా ఈ సినిమా ఉంటుందని సినిమా వర్గాలు ధీమాగా ఉన్నాయి. ఈ సినిమా కోసం ప్రభాస్ బల్క్ డేట్స్ కేటాయించారని, వచ్చే ఏడాది మే నెల తర్వాత ఈ సినిమా విడుదలవుతుందని ఒక సమాచారం.

- January 31, 2025
0
25
Less than a minute
Tags:
You can share this post!
editor