‘స్పిరిట్‌’లో ప్ర‌భాస్ మూడు కొత్త లుక్స్‌లో…

‘స్పిరిట్‌’లో ప్ర‌భాస్ మూడు కొత్త లుక్స్‌లో…

హీరో ప్ర‌భాస్, అర్జున్ రెడ్డి, యానిమ‌ల్ చిత్రాల‌ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా కాంబోలో ‘స్పిరిట్‌’ అనే సినిమా తెర‌కెక్కనున్న విష‌యం తెలిసిందే. సుమారు రూ.300 కోట్ల బడ్జెట్‌తో రానున్న ఈ సినిమాని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మించ‌నున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటున్న ఈ సినిమా నుండి అప్‌డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ల‌ను సంక్రాంతి కానుక‌గా ఇవ్వ‌నున్నట్లు ద‌ర్శ‌కుడు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇక డిసెంబ‌ర్‌లో ప‌ట్టాలెక్క‌నున్న ఈ సినిమాకు సంబంధించిన వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ప్ర‌భాస్ మూడు కొత్త లుక్స్‌లో క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి, యానిమ‌ల్ సినిమా త‌ర‌హాలో ‘స్పిరిట్‌’లో కూడా ప్ర‌భాస్‌ను డిఫ‌రెంట్‌గా చూపించ‌బోతున్న‌ట్లు సమాచారం. వచ్చే నెలలో సినిమాని ప్రారంభించి… జనవరి నుండి రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలు పెట్టనున్నట్లు తెలిసింది. ఆరు నెల‌ల్లోనే ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్‌ చేయబోతున్నట్లు వినికిడి.

administrator

Related Articles