‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ప్రోగ్రామ్‌కు చీఫ్ గెస్ట్‌గా పవన్ కళ్యాణ్?

‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ప్రోగ్రామ్‌కు చీఫ్ గెస్ట్‌గా పవన్ కళ్యాణ్?

హీరో రామ్‌చర‌ణ్, డైరెక్టర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమాను అగ్ర నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తుండ‌గా.. థ‌మ‌న్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. రామ్‌చ‌ర‌ణ్ – శంక‌ర్ – దిల్‌రాజు కాంబినేష‌న్‌లో ఈ సినిమా వ‌స్తుండ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేసిన టీం తాజాగా టీజ‌ర్ కూడా విడుద‌ల చేసింది. ఈ టీజ‌ర్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా.. జ‌న‌వ‌రి ఫ‌స్ట్ వీక్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను టీం ఇన్‌వైట్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ఈ వేడుకను కూడా గోదావరి జిల్లాలు అయిన (తాడేపల్లిగూడెం, కాకినాడ, రాజమండ్రి)లో ఏదైన ఒక ఊళ్లో వేడుకలు జరిపించాలని సినిమా టీం మొత్తం ఆలోచనలో ఉన్నట్లు వినికిడి.

administrator

Related Articles