ప్రభాస్ ‘ఫౌజీ’ డిసెంబర్ 3న

ప్రభాస్ ‘ఫౌజీ’ డిసెంబర్ 3న

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక సినిమా ‘ఫౌజీ’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో మేకర్స్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ అందించారు. సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. తాజా ప్రకటన ప్రకారం ‘ఫౌజీ’ సినిమా డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో ప్రభాస్ సరికొత్త లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పోస్టర్ విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, అభిమానులు భారీ ఎత్తున షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్‌ను ఇప్పటివరకు చూడని కొత్త పాత్రలో ఈ సినిమాలో చూపించనున్నట్లు సమాచారం. అద్భుతమైన విజువల్స్, భారీ నిర్మాణ విలువలు, భావోద్వేగాలతో కూడిన కథ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగంగా పూర్తిచేసి నిర్ణయించిన తేదీకే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. విడుదల తేదీ ఖరారవడంతో ప్రభాస్ అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఇప్పుడు ‘ఫౌజీ’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles