ఈ మధ్య సెలబ్రిటీల మరణ వార్తలకి సంబంధించి ఎక్కువగా వార్తలు వింటున్నాం. అనారోగ్యంతో కన్ను మూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మలయాళ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు విష్ణు ప్రసాద్ లివర్ సంబంధిత సమస్యలతో కన్నుమూసారు. ఆయన కొంతకాలంగా లివర్ సంబంధిత సమస్యతో బాధపడుతుండగా, ఆయనని చికిత్స కోసం కేరళలోని ఆసుపత్రిలో చేర్పించారు. అయితే శుక్రవారం ఉదయం విష్ణుప్రసాద్ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కో యాక్టర్ సత్య తెలియజేశారు. ఆమె విష్ణు ప్రసాద్ అనారోగ్య సమస్యల గురించి తెలియజేస్తూ అతని కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వైద్యులు విష్ణుకి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరమని తెలిపారు. సర్జరీకి దాదాపు రూ.30 లక్షల మేర అవసరం అవుతుందని చెప్పగా, విష్ణు ప్రసాద్ కుటుంబం, మలయాళ టీవీ యాక్టర్స్ సంఘంతో కలిసి నిధులు సేకరించే ఏర్పాట్లు చేస్తున్నారు. పలువురిని ఆర్ధిక సాయం అందించాలని అభ్యర్ధించారు. విష్ణు కుమార్తెల్లో ఒకరు లివర్ డొనేట్ చేసేందుకు కూడా ముందుకొచ్చారు. డబ్బు సేకరించే లోపే విష్ణు ప్రసాద్ కన్నుమూశారు.
- May 2, 2025
0
75
Less than a minute
Tags:
You can share this post!
editor

