టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే.. తిరుపతి జిల్లాలోని ప్రఖ్యాతి గాంచిన శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకుంది. గురువారం ఉదయం శ్రీకాళహస్తికి వెళ్లిన పూజా రాహుకేతు పూజలో పాల్గొంది. అనంతరం శ్రీ వాయు లింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకుంది. దర్శనానంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులు శేష వస్త్రంతో పూజాను సత్కరించి, వేద ఆశీర్వచనాలతో.. తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. సినిమాల విషయానికి వస్తే.. పూజా ప్రస్తుతం దళపతి విజయ్‌తో జననాయగన్ సినిమాలో నటించడంతో పాటు సూర్య హీరోగా వస్తున్న రెట్రో సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

- April 3, 2025
0
9
Less than a minute
Tags:
You can share this post!
editor