నాని ‘హిట్‌ 3’లో కార్తీ అతిథి పాత్ర‌లో..!

నాని ‘హిట్‌ 3’లో కార్తీ అతిథి పాత్ర‌లో..!

హీరో నాని ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా సినిమా హిట్ 3. బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్రాంచైజీ హిట్ నుండి వ‌స్తున్న 3వ సినిమా ఇది. ఈ సినిమాలో నాని హీరోగా న‌టించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు. శైలేష్‌ కొలను దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుండ‌గా.. మే 1న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త వైర‌ల్‌గా మారింది. ఈ సినిమాలో త‌మిళ న‌టుడు కార్తీ అతిథి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. కొంద‌రేమో కార్తీ నానితో క‌లిసి క‌నిపిస్తాడ‌ని ప్ర‌చారం చేస్తుండ‌గా.. మ‌రికొంద‌రు కార్తీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించవచ్చని అంటున్నారు. హిట్ 2 క్లైమాక్స్ లాగానే “హిట్ 3” క్లైమాక్స్‌లో కొత్త హీరో ఎంట్రీ ఇస్తాడ‌ని ఆ హీరో పాత్ర‌లోనే కార్తీ రాబోతున్నాడ‌ని.. ఇది “హిట్ 4” కి లీడ్ ఇస్తుందని కూడా టాక్ నడుస్తోంది. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఇక హిట్ 3 విష‌యానికి వ‌స్తే.. క్రైమ్‌ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌తో రానున్న ఈ సినిమాలో నాని అర్జున్‌ సర్కార్ అనే పవ‌ర్‌ఫుల్ ఐపీఎస్‌ అధికారిగా కనిపించనున్నారు. కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

editor

Related Articles