ర‌జనీకాంత్ ‘కూలీ’లో పూజా హెగ్డే..

ర‌జనీకాంత్ ‘కూలీ’లో పూజా హెగ్డే..

లోకేష్ కనగరాజ్, రజనీకాంత్ కాంబోలో వ‌స్తున్న కూలీ సినిమాలో పూజా హెగ్డే న‌టిస్తున్న‌ట్లు తెలిసింది. త‌మిళ హీరో రజనీకాంత్ త‌న అప్‌క‌మింగ్ సినిమాల‌తో ప్ర‌స్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే జైల‌ర్ 2 అనౌన్స్‌మెంట్ ఇచ్చిన రజనీ మ‌రోవైపు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ అనే సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తుండ‌గా.. నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహీర్, శృతిహాసన్ తదితరులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. తమిళ దర్శకుల్లో ఒకరైన లోకేష్ కనగరాజ్‌తో రజనీకాంత్ జోడీ క‌డుతుండ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి. గోల్డ్‌ స్మగ్లింగ్‌కు సంబంధించిన కథాంశంగా ఈ సినిమా రూపొందుతుండగా ఇప్ప‌టికే విడుద‌లైన ప్రోమో, సాంగ్‌ ఆక‌ట్టుకుంటోంది. ఈ సినిమాలోని ఫ‌స్ట్ లుక్‌ని చిత్రబృందం విడుద‌ల చేసింది. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే స్పెష‌ల్ సాంగ్‌లో నటిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

editor

Related Articles