తమిళ నటుడు ధనుష్, అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘కుబేర’. తమిళ నటుడు ధనుష్ హీరోగా రూపొందుతోన్న తాజా సినిమా ‘కుబేర’. శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా.. టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను జూన్ 20న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను షేర్ చేసింది. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతోంది. ధనుష్ ఇందులో బిచ్చగాడి పాత్రల్లో కనిపించనుండగా.. నాగార్జున బిజినెస్ టైకున్ పాత్రలో మెరవబోతున్నాడు. ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్‌రావుతో కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి సంగీతం: దేవిశ్రీప్రసాద్.

- February 27, 2025
0
17
Less than a minute
Tags:
You can share this post!
editor