పోసానికి నోటీసులు ఇచ్చిన పోలీసులు

పోసానికి నోటీసులు ఇచ్చిన పోలీసులు

సినీ నటుడు పోసాని కృష్ణమురళికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 15వ తేదీన విచారణకు హాజరు కావాలని పోలీసులు పోసానికి నోటీసులు జారీ చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం సీఐడీ కార్యాలయంలో సంతకం చేయడానికి పోసాని వెళ్లిన సందర్భంలో ఈ నోటీసులు అందించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌లపై అసభ్య వ్యాఖ్యలు చేసినందుకు పోసానిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 15కి పైగా కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామాల మధ్య ఆయన వివిధ జైళ్లలో రిమాండ్ ఖైదీగా కొంత కాలం గడిపారు. గత నెలలో కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

editor

Related Articles