ప్రముఖ గేయ రచయిత Jonnavithula Ramalingeswara Rao దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లలిత’. కాస్మిక్ పవర్ క్రియేట్స్ ఎల్.ఎల్.పి బ్యానర్‌పై పి. సుధీర్ రాజు, డి. వైష్ణవి నేహా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో నందిని హీరోయిన్‌గా పరిచయం అవుతుండగా, అభిలాష్ పీలా, అఖిల్ వివాన్ హీరోలుగా నటిస్తున్నారు. మహిళా ఆత్మగౌరవం, వ్యక్తిత్వం, విశ్వాసం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సామాజిక కథ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా ‘గర్ల్‌ఫ్రెండ్ అంటే బానిస కాదు…’ అనే క్యాప్షన్ సినిమాపై మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి సంగీతాన్ని మణి, నాగరాజు అందిస్తున్నారు. వేణుగాన విశారద అవార్డు గ్రహీత నాగరాజు సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అలాగే రఘు బాబు, పృథ్వీ రాజ్, తాగుబోతు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ విడుదల కానున్నాయి.
- May 18, 2026
0
15
Less than a minute
You can share this post!
editor

