తాజాగా నేడు జరిగిన టీజర్ లాంచ్ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ సుబ్బుకు ఈ వివాదంపై ప్రశ్న ఎదురైంది. అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘బచ్చలమల్లి’. ఈ సినిమా టీజర్ నేడు రిలీజ్ అయింది. దీనికి సంబంధించి ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. అయితే గతంలో బచ్చలమల్లి గ్లింప్స్ రిలీజ్ అయినప్పుడు.. అందులో మైక్‌లో భగవద్గీత వస్తుంటే అల్లరి నరేష్ దాన్ని పీకి కింద పడేస్తాడు. దీంతో ఆ గ్లింప్స్ వివాదంగా మారింది. పలు హిందూ సంఘాలు దీనిపై విమర్శలు చేశాయి. దర్శకుడిని కూడా విమర్శించారు.
తాజాగా నేడు జరిగిన టీజర్ లాంచ్ ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ సుబ్బుకు ఈ వివాదంపై ప్రశ్న ఎదురైంది. దీనికి సుబ్బు సమాధానమిస్తూ.. నన్ను విమర్శిస్తూ ట్విట్టర్లో, కామెంట్స్‌లో తిట్టారు. వాళ్లంతా బచ్చలమల్లి క్యారెక్టర్ లాగే మూర్ఖులు. సినిమా చూడకుండానే టీజర్ చూసి నన్ను అలా కామెంట్ చేశారు. వాళ్ళే సినిమా చూశాక నాకు సారీ చెప్తారు. అయినా ఆ ఇష్యూ సాల్వ్ అయిపోయింది. నేను హిందువుని. నా కల్చర్ అంటే నాకు ఇష్టం. నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్‌ని. ఆయనే సనాతన ధర్మం గురించి అంత గొప్పగా చెప్తుంటే నేను ఆయన ఫ్యాన్‌ని, ఆయన చెప్తే నేను విననా. నేను అన్ని దేవాలయాలకు వెళ్లి దర్శనం చేసుకుంటాను. నేను నా ధర్మానికి, నా దేవుళ్ళకు, నా పద్ధతులకు రెస్పెక్ట్ ఇస్తాను. నేను హిందువు అని గర్వంగా చెప్పుకుంటాను అని అన్నారు. దీంతో సుబ్బు చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.