బామ్మను సత్కరించి భోజనం పెట్టి, చీర, డబ్బు అందజేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

బామ్మను సత్కరించి భోజనం పెట్టి, చీర, డబ్బు అందజేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

రాజ‌కీయాల‌లోకి వ‌చ్చాక సినిమాలు త‌గ్గించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఎక్కువ స‌మయం గ‌డుపుతున్నాడు. అయితే ఇప్పుడు ఏ ప‌ని చేసినా కూడా అది క్ష‌ణాల‌లో వైర‌ల్ అవుతోంది. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న క్యాంప్ ఆఫీసుకి 96 ఏళ్ల బామ్మ‌ని పిలిపించుకుని ఆమెకి భోజ‌నం పెట్టి చీర, కొంత డ‌బ్బుని బ‌హుక‌రించారు. 96 ఏళ్ల వృద్ధురాలు పోతుల పేరంటాలు ప‌వ‌న్‌తో కలిసి భోజ‌నం చేయ‌డంతో ఆమె ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. కాకినాడ జిల్లాకు చెందిన పేరంటాలు, పవన్ కల్యాణ్‌తో భోజనం చేయాలని ఎప్ప‌టి నుండో అనుకుంటుండేది. ఈ విష‌యం తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి తెలియ‌గా, ఆయ‌న వెంట‌నే స్పందించి ఆమెను జనసేన క్యాంపు కార్యాలయానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. క్యాంపు ఆఫీసుకి వ‌చ్చిన పేరంటాలుని ప్రేమ‌గా ప‌ల‌క‌రించి ఆత్మీయ ఆలింగ‌నం చేసుకున్నారు. ఆమెతో కలిసి భోజనం చేశారు. అంతేకాకుండా, ఆ వృద్ధురాలికి లక్ష రూపాయల నగదును ఆర్థిక సహాయంగా అందించి, కొత్త చీరను కూడా బహూకరించారు. ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పేరంటాలుని సొంత ఇంటి మ‌నిషిలా చూసుకోవ‌డంతో అందరు అవాక్క‌య్యారు. పేరంటాలు ఆనందానికి అయితే అవ‌ధులు లేవని చెప్పాలి. ప్ర‌స్తుతం ఈ అపురూప దృశ్యాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్క‌ర్లు కొడుతున్నాయి. కాగా, కాకినాడ జిల్లా, కొత్తపల్లి మండలం, కొత్త ఇసుకపల్లి గ్రామానికి చెందిన పోతుల పేరంటాలు, పవన్ కల్యాణ్, జనసేన పార్టీకి వీరాభిమాని.

editor

Related Articles