టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ రెండు కిడ్నీలు చెడిపోయి నడవలేని దయనీయ స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. ప్రముఖ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫిష్ వెంకట్‌పై చేసిన ఓ వీడియో వలన ఈ విషయం బయటకు వచ్చింది. తన రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఇంట్లో ఉండాల్సి వస్తోందని, ఖర్చులకు డబ్బుల్లేక ఇబ్బంది పడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యం చేయించుకుంటున్నానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాజాగా ఆయన పరిస్థితి తెలుసుకుని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.2 లక్షలు పంపించినట్లు ఒక వీడియోలో చెప్పుకొచ్చారు. అలాగే నా రెండు రెండు కిడ్నీలు చెడిపోయి నడవలేని స్థితిలో ఉన్నాను. ప్రస్తుతం డయాలసిస్ జరుగుతోంది. నేను ఇప్పటివరకు ఏ హీరో దగ్గరికి వెళ్లి హెల్ప్ అడగలేదు. షూటింగ్‌లో వెళ్లి కలవడం తప్ప ఇలా ఎప్పుడూ కలవలేదు. నా భార్య పవన్ సర్‌ని వెళ్లి కలవండి అని చెప్పింది. అతడిని కలిస్తే.. మీకు ట్రీట్‌మెంట్ చేయిస్తాడు. అంటూ ఒత్తిడి చేయడంతో వెళ్లి పవన్‌ని కలిశాను. అతడికి నా పరిస్థితి ఇలా ఉందని చెప్పాను. వెంటనే ఆయన స్పందించి నాకు చికిత్స అందించారు. అలాగే నా ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పడంతో రూ.2 లక్షల రూపాయలు నా బ్యాంక్ అకౌంట్‌లో డిపాజిట్ చేయించారు. ఆయనకు నా పాదాభివందనాలు.

- January 2, 2025
0
176
Less than a minute
You can share this post!
editor