రాంగోపాల్‌ వర్మ హాజరు కాకపోవడంపై స్పందించని పవన్ కళ్యాణ్‌

రాంగోపాల్‌ వర్మ హాజరు కాకపోవడంపై స్పందించని పవన్ కళ్యాణ్‌

ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్‌లో పోస్ట్ చేసిన వ్యవహారంలో డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణకు హాజరుకాని వర్మ కోసం ఏపీ పోలీసులు కోయంబత్తూరు వెళ్లినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్న పవన్‌ కళ్యాణ్‌ను ఆర్జీవీ వ్యవహారంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఆర్జీవీ కేసులో పలువురు నోటీసులు ఇచ్చినా విచారణకు రాకపోవడంపై ఇప్పుడే ఏం స్పందించనన్నారు. ఈ కేసు విషయంలో పోలీసులను పని చేసుకోనివ్వండి. నా పని నేను చేస్తా. పోలీసుల సామర్థ్యంపై నేను స్పందించనని చెప్పారు. హోంశాఖ, లా అండ్‌ ఆర్డర్‌ నా పరిధిలో లేవు. మీరు అడగాల్సింది ముఖ్యమంత్రిని. నేను ఏం మాట్లాడినా బాధ్యతగా ఉండాలి. మీరు చెప్పిన విషయాలన్నీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తా.

editor

Related Articles