ఆప‌రేష‌న్ సింధూర్ .. చిరంజీవితో పాటు పలువురి స్పందన..

ఆప‌రేష‌న్ సింధూర్ .. చిరంజీవితో పాటు పలువురి స్పందన..

ప‌హ‌ల్గామ్‌ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా పాక్, పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లోని ఉగ్ర‌స్థావ‌రాల‌పై భార‌త సైన్యం విరుచుకుప‌డిన విష‌యం తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావ‌డంతో పలువురు సెలబ్రిటీలు, ప్రజలు భారత సైన్యానికి సెల్యూట్ చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి త‌న ఎక్స్‌లో జైహింద్ అంటూ భార‌త సైన్యాన్ని ప‌రోక్షంగా అభినందించారు. బేబీ చిత్ర నిర్మాత ఎస్ కే ఎన్ భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌ను అభినందిస్తూ.. ‘జైహింద్.. మనందరి ప్రార్థనలు భారత సైన్యానికి తోడుగా ఉంటాయి అని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇక ప్ర‌ముఖ న‌టి కాజ‌ల్ అగ‌ర్వాల్ మైత్రి బోధ్ పరివార్ సంస్థ ద్వారా భారత సైన్యానికి మద్దతు తెలుపుతూ సందేశాన్ని షేర్ చేశారు. ఇక సీనియర్ నటుడు పరేశ్ రావల్ ఆపరేషన్‌ సింధూర్‌పై హ‌ర్షం వ్య‌క్తం చేశారు. న‌టి తాప్సీ ప‌న్ను… ఆప‌రేష‌న్ సింధూర్‌పై హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ.. తెలుగు నటి బిందు మాధవి కూడా ఈ ఆపరేషన్‌పై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 పాక్ ఉగ్రస్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేశాయి. 4 జైషే మహ్మద్, 3 లష్కరే తొయిబా ఉగ్రస్థావరాలపై ఈ దాడులు జరిగాయి. రెండు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులు చేశాయి. కోట్లీ, బహ్వాల్‌పూర్‌, మురిడ్కే, ముజఫరాబాద్‌లో దాడులు చేసింది. చాక్ అమ్రు, గుల్పూర్, భీంబర్, సియాల్‌కోట్‌పై దాడులు చేసింది.

editor

Related Articles