పవన్ కుమారుడు ప్రమాదంపై స్పందించిన ఎన్టీఆర్

పవన్ కుమారుడు ప్రమాదంపై స్పందించిన ఎన్టీఆర్

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌  చిన్నకుమారుడు మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌ సింగపూర్‌లోని స్కూల్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో చిన్నారి మార్క్‌ కాళ్లు, చేతులకు గాయాలు కాగా, ఊపిరితిత్తుల్లోకి పొగ చేరింది. ప్రస్తుతం అతడు సింగపూర్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఈ ఘటనపై స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పవన్‌కళ్యాణ్‌ గారి కుమారుడు గాయపడిన విషయం తెలిసి తాను ఎంతో బాధపడినట్లు తెలిపారు. చిన్నారి మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఎక్స్ వేదిక ద్వారా తారక్ కోరుకున్నారు. ‘ధైర్యంగా ఉండు లిటిల్ వారియ‌ర్‌’ అంటూ ఒక పోస్ట్‌ను షేర్ చేశారు.

editor

Related Articles