బాలీవుడ్ నటి, మండి లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ నివాసానికి రూ.లక్ష కరెంటు బిల్లు వచ్చింది. ఆ బిల్లు చూసి నటి ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఈ మేరకు హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడింది. తాను అసలు ఆ ఇంట్లోనే ఉండటం లేదని.. అలాంటప్పుడు రూ.లక్ష కరెంటు బిల్లు ఎలా వస్తుందని ప్రశ్నించింది. మీడియాతో బుధవారం నటి మాట్లాడారు. మనాలిలోని తన నివాసానికి రూ.లక్ష కరెంటు బిల్లు వచ్చినట్లు చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఇలాంటి పరిస్థితులు సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉన్న సోదరీ సోదరులను తాను ఒకటి కోరుతున్నానని, అందరం కలిసి సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. దేశం, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

- April 9, 2025
0
6
Less than a minute
Tags:
You can share this post!
editor