టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కెరీర్ తొలినాళ్ళలోనే వరుస హిట్స్ అందుకున్నాడు. ఆయన చేసిన ఫస్ట్ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత దర్శక ధీరుడు రాజమౌళితో చేసిన ‘సై’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. అనంతరం వరుస సినిమాలు చేసినప్పటికీ పెద్దగా ఆడలేదు. వరుస ఫ్లాప్స్‌లో ఉన్న నితిన్‌కి మంచి కం బ్యాక్ ఇచ్చిన సినిమానే ఇష్క్. కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది. అయితే ఈ సినిమా 2012 లో విడుదలైంది. దాదాపుగా ఇప్పుడు 11 ఏళ్ల తరువాత మళ్ళీ ఈ సినిమా రీ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ నెల 30న ఇష్క్ సినిమా మళ్ళీ థియేటర్స్‌లోకి రానుంది. ఇక ఈ సినిమాలో నితిన్, నిత్య మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. అనూప్ రూబెన్స్, అరవింద్ శంకర్ సంగీతం అందించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే చాలామంది స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్లు రాబట్టిన సంగతి తెలిసిందే.

- November 5, 2024
0
44
Less than a minute
Tags:
You can share this post!
administrator