జ్యోతిక లేకపోతే నేను లేను.. సూర్య ఎమోషనల్‌

జ్యోతిక లేకపోతే నేను లేను.. సూర్య ఎమోషనల్‌

బాలకృష్ణ  హోస్ట్​గా చేస్తున్న అన్​స్టాపబుల్  సీజన్​ 4 విజ‌య‌వంతంగా ర‌న్ అవుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా త‌మిళ నటుడు సూర్య ఈ షోకి వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియో తాజాగా విడుదలైంది. తాజాగా త‌మిళ స్టార్ హీరో సూర్య ఈ షోలో సంద‌డి చేశారు. ముందుగా బాలకృష్ణ.. సూర్య నటించిన సినిమాల్లోని పాటలు పాడుతూ ఆయన్ని వేదికపైకి ఆహ్వానించారు. బాలకృష్ణ అడిగిన పలు ప్రశ్నలకు సూర్య చాలా సదరాగా ఆన్సర్ చేశారు. అదేవిధంగా తన భార్య జ్యోతిక, తమ్ముడు కార్తి గురించి సూర్య ఆసక్తికర విషయాలు షేర్ చేశారు. మీ ఫస్ట్‌ క్రష్‌ ఎవరని బాలకృష్ణ అడగగా.. ‘వద్దు సార్‌.. ప్రాబ్లమ్‌ అవుతుంది. ఇంటికెళ్లాలి’ అంటూ సూర్య సరదాగానే రిప్లై ఇచ్చారు. ఇంతలో బాలకృష్ణ.. కార్తికి లైవ్‌లో ఫోన్‌ చేసి సూర్య గురించి అడిగారు. సూర్యకు ఓ హీరోయిన్‌ అంటే బాగా ఇష్టమని కార్తి చెప్పాడు, ఆ విషయం ప్రోమోలో తెలుస్తుంది. దీంతో ‘నువ్వు కత్తిరా.. కార్తి కాదు’ అంటూ సూర్య అంటారు. ఇక జ్యోతిక గురించి మాట్లాడుతూ.. వీరిద్దరి మధ్య సాగిన సరదా సంభాషణ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. సూర్యకు సంబంధించిన ఫుల్‌ ఎపిసోడ్‌ నవంబర్‌ 8న (శుక్రవారం) ఆహాలో లైవ్‌లో చూడవచ్చు.

administrator

Related Articles