ఆమె ఇటీవలి పెట్టిన పోస్ట్‌లలో ఒకటి తన అందమైన లావెండర్ డ్రెస్‌లో కనిపిస్తోంది. ఇనాయా సుల్తానా తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా, మోడల్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఆగస్ట్ 21, 1995న జన్మించిన ఇనాయ 2021లో తన మోడలింగ్ ప్రయాణాన్ని ప్రారంభించింది. మొదట్లో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, ఆమె పట్టుదల చివరకు ఫలించింది. 2021లో ఆమె పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో డ్యాన్స్ వీడియో వైరల్ అయినప్పుడు ఆమెకు ఒక పెద్ద అవకాశం అనుకోకుండా వచ్చింది.
“ఏవుం జగత్” సినిమాతో ఇనాయ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆమె త్వరలో “బుజ్జి ఇలా రా”, “నటరత్నాలు”, “యద్ భావం తద్ భవతి” వంటి సినిమాలలో ఇతర పాత్రలను కూడా పోషించింది, ఆమె ఫ్యాన్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పూర్తిగా తనవైపు తిప్పుకుంది, ఆమె ఇటీవలి పోస్ట్‌లలో ఒక అందమైన లావెండర్ దుస్తులలో కనిపించింది, “లావెండర్” అనే క్యాప్షన్‌ను కూడాపెట్టింది,” ఆమె తన ఫాలోయర్స్ నుండి ప్రశంసలను కూడా పొందుతోంది.