టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ కాంపౌండ్ నుండి వస్తోన్న తొలి పాన్ ఇండియా సినిమా స్వయంభు. ఈ సినిమాకి కేజీఎఫ్ ఫేం రవిబస్రూర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడని తెలిసిందే. తెలుగుతోపాటు పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ సంపాదించుకున్న యాక్టర్లలో ఒకడు టాలీవుడ్ యాక్టర్ నిఖిల్ సిద్దార్థ. నిఖిల్ నటించిన ఈ సినిమాలో మలయాళ బ్యూటీ సంయుక్తామీనన్ ఫిమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. నిఖిల్‌తోపాటు పాపులర్ సినీ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి కర్ణాటక బస్రూర్‌లోని స్టూడియోకు వెళ్లిన వారిలో ఉన్నారు. నిఖిల్ సిద్దార్థ 2025లో స్వయంభు థియేటర్లలోకి రాబోతోంది. స్వయంభు సినిమాకి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. స్వయంభులో నిఖిల్ యుద్ధ వీరుడిగా ఇదివరకెన్నడూ కనిపించని సర్‌ప్రైజింగ్ లుక్‌లో కనపడబోతున్నట్టు మేకర్స్ విడుదల చేసిన పోస్టర్లతో క్లారిటీ ఇచ్చేశారు.

- January 8, 2025
0
25
Less than a minute
Tags:
You can share this post!
editor