హాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాలో హీరో హీ-మ్యాన్ పాత్రకు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ వాయిస్ అందించడం విశేషం. కార్తికేయ, కార్తికేయ 2, స్పై వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ఇప్పుడు ఈ ఐకానిక్ పాత్రకు డబ్బింగ్ చెప్పడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇక విలన్ స్కెలెటర్ పాత్రకు ఆదిత్య మీనన్, డంకన్ పాత్రకు రావు రమేష్ వాయిస్ ఇవ్వడం సినిమాకు మరింత బలం చేకూర్చింది. ట్రావిస్ నైట్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నికోలస్ గలిట్జైన్, కమిలా మెండెస్, జారెడ్ లెటో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సోనీ పిక్చర్స్ విడుదల చేస్తున్న ఈ చిత్రం జూన్ 5న తెలుగు సహా పలు భారతీయ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
- May 20, 2026
0
11
Less than a minute
You can share this post!
editor

