రుషి కలను నిజం చేసిన మెగాస్టార్ చిరంజీవి..!

రుషి కలను నిజం చేసిన మెగాస్టార్ చిరంజీవి..!

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. తెలంగాణ ఈఏపీసెట్ 2026లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన హైదరాబాద్ రెజోనెన్స్ జూనియర్ కాలేజీ విద్యార్థిని ఎం. రుషిని ప్రత్యేకంగా అభినందించారు. చిన్నప్పటి నుంచే చిరంజీవిని కలవాలని కలగన్న రుషి.. మంచి ర్యాంక్ సాధిస్తే ఆ కల నిజమవుతుందని తల్లిదండ్రులు ప్రోత్సహించగా, ఇప్పుడు ఆ కల నిజమైంది. చిరంజీవి స్వయంగా రుషి, ఆమె కుటుంబ సభ్యులను కలుసుకుని అభినందించారు. అంతేకాకుండా ఆమె ప్రతిభకు గుర్తింపుగా ఒక ల్యాప్‌టాప్‌ను బహుమతిగా అందించారు. రుషి భవిష్యత్తులో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఐఏఎస్ అధికారి కావాలనే లక్ష్యాన్ని తెలుసుకున్న చిరంజీవి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. “ఏ సహాయం కావాలన్నా సంకోచం లేకుండా సంప్రదించండి. నన్ను కుటుంబ సభ్యుడిలా భావించండి” అంటూ రుషి కుటుంబానికి భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Related Articles