వారాహి ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సోమేష్ నిర్మాతగా, శ్రీనివాస్ బండ్రెడ్డి రచన మరియు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆత్మకథ – యాన్ అన్ టోల్డ్ స్టోరీ’. తాజాగా ఈ చిత్ర టైటిల్ మరియు ట్రైలర్‌ను సినీ ప్రముఖుడు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేతుల మీదుగా ఘనంగా విడుదల చేశారు. జెమిని సురేష్ హీరోగా నటిస్తుండగా రూప హీరోయిన్‌గా కనిపించనుంది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, సమ్మెట గాంధీ, షకలక శంకర్, తాగుబోతు రమేష్, ధనరాజ్, నాగ మహేష్, బలగం విజయలక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్, నటుడు కెవి ప్రదీప్, నటి కరాటే కళ్యాణి పాల్గొన్నారు. శ్రేయాంశ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి గోపి సినిమాటోగ్రఫీ అందించగా, రాఘవేంద్ర రెడ్డి ఎడిటింగ్ నిర్వహించారు. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
- May 21, 2026
0
53
Less than a minute
You can share this post!
editor

