లేడి ద‌ర్శ‌కురాలితో సినిమా తీయనున్న నిహారిక

లేడి ద‌ర్శ‌కురాలితో సినిమా తీయనున్న నిహారిక

నాగబాబు కూతురు నిహారిక కొణిదెల ఒక‌వైపు సినిమాల‌లో న‌టిస్తూనే మ‌రోవైపు నిర్మాతగా రాణిస్తోంది. ఇప్ప‌టికే ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాను నిర్మించి సూప‌ర్ హిట్ టాక్ అందుకున్న నిహారిక తాజాగా మరో సినిమాను నిర్మించ‌బోతోంది. నిహారిక త‌న సొంత ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ అయిన ‘పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌’  బ్యాన‌ర్‌పై మ‌రో ఫీచ‌ర్ ఫిల్మ్ తెర‌కెక్కించ‌బోతోంది. ఈ ప్రాజెక్ట్‌కు మాన‌స శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతోంది. పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్  బ్యాన‌ర్‌లో ఇంత‌కుముందే క్రియేటివ్‌ డైరెక్టర్‌గా రెండు సిరీస్‌ల‌ను తెర‌కెక్కించింది మాన‌స. మానస దర్శకత్వంలో వ‌చ్చిన ‘ఒక చిన్న ఫ్యామిలీ’ జీ5 ప్లాట్‌ఫామ్‌లో ప్ర‌సార‌మ‌వుతుండ‌గా.. ‘బెంచ్‌ లైఫ్‌’ సిరీస్ సోనీలీవ్‌లో ప్రేక్షకులను అలరిస్తుంది. ఇప్పుడు ఆమె తన మూడో ప్రాజెక్ట్‌గా ఒక ఫీచర్ ఫిల్మ్‌ను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

editor

Related Articles