సవ్యసాచి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ నిధి అగర్వాల్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’తో బ్లాక్‌బాస్టర్ హిట్ కొట్టేసింది ఈ హీరోయిన్. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ హీరోయిన్ తన కెరీర్ ప్రారంభంలో జరిగిన ఒక సంఘటన గురించి తాజాగా షేర్ చేసింది. తన మొదటి సినిమా టైంలో హీరోతో డేట్ చేయవద్దని చిత్రయూనిట్ బాండ్ రాయించుకున్నారని తెలిపింది. బాలీవుడ్ హీరో జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ‘మున్నా మైఖేల్’ సినిమాతో బాలీవుడ్‌లో నా సినీ ప్రస్థానం మొదలైంది. ఈ సినిమాకు ఓకే చెప్పిన తర్వాత చిత్రయూనిట్ నాతో ఒక కాంట్రాక్ట్‌పై సంతకం చేయించింది. ఆ కాంట్రాక్ట్‌లో సినిమాకు సంబంధించి నేను పాటించాల్సిన నియమాలు ఉన్నాయి. అందులో ‘నో డేటింగ్’ అనే షరతు కూడా ఉంది. దానికి అర్థం సినిమా కంప్లీట్ అయ్యేవరకు నేను హీరోతో డేటింగ్ చేయకూడదని. అయితే ఇది చదవకుండా నేను సంతకం పెట్టాను. తర్వాత ఈ విషయం తెలిసి నేను చాలా షాక్ అయ్యాను. నటీనటులు ప్రేమలో పడితే పనిపై శ్రద్ధ తగ్గుతుందని టీమ్ భావించి ఉంటుంది. అందుకే ఇలాంటి నిబంధనలు జోడించి ఉంటారని అనుకున్నానంటూ నిధి చెప్పుకొచ్చింది. సినిమాల విషయానికి వస్తే.. నిధి ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘హరి హర వీరమల్లు’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- March 22, 2025
0
24
Less than a minute
Tags:
You can share this post!
editor