టాలీవుడ్ అందమైన జంటల్లో ఒకరిగా నిలిచిన నాగచైతన్య, శోభిత ధూళిపాళ ప్రస్తుతం తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో బిజీగా గడుపుతున్నారు. 2024 డిసెంబర్‌లో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ తమ తమ సినీ ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే, సమయం దొరికినప్పుడల్లా కలిసి కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
తాజాగా ఈ జంట ఓ ప్రముఖ చీరల దుకాణాన్ని సందర్శించింది. షాపింగ్‌కు వచ్చిన వారిని చూసిన అభిమానులు, అక్కడి సిబ్బంది వారితో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఒకరు “వదినకి ఏ చీర తీసుకుంటారు?” అని నాగచైతన్యను ప్రశ్నించగా, ఆయన చిరునవ్వుతో ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
“తను ఏది ఎంచుకుంటే… అదే తీసుకుంటాను” అంటూ నాగచైతన్య చెప్పిన సమాధానం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. భార్య అభిరుచికే ప్రాధాన్యం ఇస్తానన్న ఆయన మాటలు అభిమానులను కూడా మెప్పించాయి. ఈ క్యూట్ మూమెంట్‌ను అక్కడున్న వారు వీడియోగా చిత్రీకరించగా, అది సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. నాగచైతన్య సమాధానంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తూ, ఈ జంటను “మేడ్ ఫర్ ఈచ్ అదర్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, నాగచైతన్య ప్రస్తుతం దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న ‘వృషకర్మ’ సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు శోభిత ధూళిపాళ కూడా పలు భాషల్లో ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

